కోల్‌కతా చిత్రోత్సవంలో అప్పూ

Published: Sun,January 20, 2019 11:53 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

ఆదివారం ప్రారంభమైన 8వ కోల్‌కతా అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో అప్పూ చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. ఈ నెల 22న ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ 2017లో హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన మా చిత్రం మరో ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎంపికకావడం ఆనందంగా ఉంది అన్నారు. మాస్టర్ సాయిశ్రీవంత్ (యశస్వి) టైటిల్ రోల్‌లో మోహన్ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందించారు. ఎనిమిదేళ్ల బాలుడు అప్పూ ఏనుగుని చూడాలనే తన కోరికను ఎలా నెరవేర్చుకున్నాడనేదే ఈ చిత్ర కథాంశం. జాకీ, లోహిత్‌కుమార్, ప్రజ్ఞ, బిందు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.

614

More News