విరిసిన నందివర్ధనాలు


Tue,November 14, 2017 11:01 PM

AP Government announces Nandi Awards

ఉత్తమ నటులుగా బాలకృష్ణ, మహేష్‌బాబు, ఎన్టీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014, 2015, 2016 సంవత్సరాలకుగాను ప్రతిష్టాత్మక నంది అవార్డులను ప్రకటించింది. బాలకృష్ణ, మహేష్‌బాబు, ఎన్టీఆర్ ఉత్తమ నటులుగా అవార్డులను కైవసం చేసుకున్నారు. లెజెండ్, బాహుబలి, పెళ్లిచూపులు ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి. 2014 సంవత్సరానికిగాను లెజెండ్, 2015 సంవత్సరానికిగాను బాహుబలి (ది బిగినింగ్) అత్యధిక అవార్డులను కైవసం చేసుకున్నాయి. వీటితో పాటు ఎన్టీఆర్ జాతీయ అవార్డు, బి.ఎన్.రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య పురస్కారాలను కూడా ప్రకటించారు. మంగళవారం అమరావతిలో నంది అవార్డు జ్యూరీ సభ్యులు ఈ వివరాల్ని వెల్లడించారు.
bahubali

2014 సంవత్సరానికి..

ఉత్తమ చిత్రం -లెజెండ్, ఉత్తమ ద్వితీయ చిత్రం - మనం, ఉత్తమ తృతీయ చిత్రం-హితుడు, ఉత్తమ నటుడు-బాలకృష్ణ (లెజెండ్), ఉత్తమ నటి-అంజలి (గీతాంజలి), ఉత్తమ దర్శకుడు-బోయపాటి శ్రీను (లెజెండ్), ఉత్తమ ప్రజాదరణ చిత్రం -లౌక్యం, ఉత్తమ విలన్-జగపతిబాబు (లెజెండ్), ఉత్తమ సహాయనటుడు-నాగచైతన్య (మనం), ఉత్తమ సహాయనటి-మంచు లక్ష్మి (చందమామ కథలు), ఉత్తమ హాస్య నటుడు- బ్రహ్మానందం (రేసుగుర్రం), ఉత్తమ సంగీత దర్శకుడు-అనూప్‌రూబెన్స్ (మనం), ఉత్తమ బాలనటుడు -గౌతమ్‌కృష్ణ (వన్ నేనొక్కడినే), ఉత్తమ కథారచయిత -కృష్ణవంశీ (గోవిందుడు అందరివాడేలే ), ఉత్తమ సినీ విమర్శకులు-పులగం చిన్నారాయణ, స్పెషల్ జ్యూరీ అవార్డ్-సుద్దాల అశోక్‌తేజ
pelli-chupulu

2015 అవార్డులు..

ఉత్తమ చిత్రం-బాహుబలి (బిగినింగ్), ఉత్తమ ద్వితీయ చిత్రం-ఎవడే సుబ్రమణ్యం, ఉత్తమ తృతీయ చిత్రం-నేను శైలజ, ఉత్తమ దర్శకుడు-రాజమౌళి (బాహుబలి), ఉత్తమ నటుడు-మహేష్‌బాబు (శ్రీమంతుడు), ఉత్తమ కుటుంబ కథా చిత్రం-మళ్లీమళ్లీ ఇది రానిరోజు, ఉత్తమ నటి-అనుష్క (సైజ్ జీరో), ఉత్తమ విలన్-రానా (బాహుబలి), ఉత్తమ సంగీత దర్శకుడు-కీరవాణి (బాహుబలి), ఉత్తమ సహాయనటుడు-పోసాని కృష్ణమురళి (టెంపర్), ఉత్తమ సహాయనటి-రమ్యకృష్ణ (బాహుబలి), ఉత్తమ క్యారెక్టర్ నటుడు-అల్లు అర్జున్ (రుద్రమదేవి), ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత-కిషోర్ తిరుమల (నేను శైలజ), ఉత్తమ కథా రచయిత-క్రిష్ (కంచె), ఉత్తమ హాస్య నటుడు-వెన్నెల కిషోర్ (భలే భలే మగాడివోయ్), ఉత్తమ మాటల రచయిత-సాయిమాధవ్ బుర్రా (మళ్లీ మళ్లీ ఇది రానిరోజు), స్పెషల్ జ్యూరీ-నిత్యామీనన్ (మళ్లీ మళ్లీ ఇది రానిరోజు), విజయ్ దేవరకొండ (ఎవడే సుబ్రహ్మణ్యం), పార్వతీశం (కేరింత),
HITHUDU

2016 అవార్డులు..

ఉత్తమ చిత్రం-పెళ్లిచూపులు, ఉత్తమ దర్శకుడు -సతీష్ వేగేశ్న (శతమానం భవతి) ఉత్తమ ద్వితీయ చిత్రం-అర్ధనారి, ఉత్తమ నటుడు-జూనియర్ ఎన్టీఆర్ (జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో), ఉత్తమ సకుటుంబ కథా చిత్రం-శతమానంభవతి ఉత్తమ సంగీత దర్శకుడు-మిక్కి జే మేయర్ (అఆ), ఉత్తమ నటి-రీతూవర్మ (పెళ్లిచూపులు), ఉత్తమ సహాయ నటుడు-మోహన్‌లాల్ (జనతాగ్యారేజ్), ఉత్తమ విలన్-ఆది పినిశెట్టి (సరైనోడు), ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు -కల్యాణ్‌కృష్ణ కురసాల (సోగ్గాడే చిన్నినాయనా), ఉత్తమ కథా రచయిత-కొరటాల శివ (జనతా గ్యారేజ్), ఉత్తమ మాటల రచయిత- అవసరాల శ్రీనివాస్ (జ్యో అచ్యుతానంద), ఉత్తమ గేయ రచయిత-రామజోగయ్య శాస్త్రి (ప్రణామం ప్రణామం -జనతా గ్యారేజ్), ఉత్తమ హాస్య నటుడు-సప్తగిరి (ఎక్స్‌ప్రెస్ రాజా), ఉత్తమ నేపథ్యగాయకుడు-వందేమాతరం శ్రీనివాస్ (కమ్మనైన అమ్మపాట-దండకారణ్యం), స్పెషల్ జ్యూరీ-నాని (జెంటిల్‌మెన్), చంద్రశేఖర్ ఏలేటి (మనమంతా), సాగర్ కె చంద్ర (అప్పట్లో ఒకడుండేవాడు), ఉత్తమ సినీ రచన-పులగం చిన్నారాయణ (పసిడి తెర)
rajinikanth

ఎన్టీఆర్, బి.ఎన్.రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి, రఘుపతి వెంకయ్య జాతీయ అవార్డు విజేతలు

ఎన్టీఆర్ జాతీయ అవార్డు
కమల్‌హాసన్ (2014),
రాఘవేంద్రరావు (2015),
రజనీకాంత్ (2016)
బి.ఎన్.రెడ్డి జాతీయ అవార్డు
రాజమౌళి (2014)
త్రివిక్రమ్ (2015)
బోయపాటి శ్రీను (2016)
నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డు
ఆర్.నారాయణమూర్తి (2014)
కీరవాణి (2015)
కె.ఎస్.రామారావు (2016)
రఘుపతి వెంకయ్య అవార్డు
కృష్ణంరాజు (2014)
ఈశ్వర్ (2015)
చిరంజీవి (2016)
Kamal-Hassan
chiranjeevi
bala-krishna
Jr-NTR
mahesh-babu
SS-RajaMouli
boyapati-srinu
sagar-chandra
satish
suddala-ashok-teja
r-narayana-murthy
anushka
pulagam
Anjali
vnnela-kishore

1678

More News

VIRAL NEWS