అమెరికాలో నిశ్శబ్ధం


Sat,July 20, 2019 11:12 PM

anushkas nishabdham movie title first look released

అనుష్క కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం నిశ్శబ్ధం. హేమంత్ మధుకర్ దర్శకుడు. టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మాతలు. ప్రస్తుతం ఆమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటున్నది. శనివారంతో అనుష్క చిత్రసీమలో 14ఏళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని నిశ్శబ్ధం ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఆమెరికాలోని సియాటల్‌లో చిత్రీకరణ జరుపుతున్నాం. షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. నిర్మాణానంతర కార్యక్రమాల్ని యూ.ఎస్‌లోనే జరుపబోతున్నాం. తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ, మలయాళ భాషల్లో ఈ సంవత్సరాంతంలో భారీస్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అనుష్క పాత్ర చిత్రణ మునుపెన్నడూ లేని విధంగా వైవిధ్యంగా ఉంటుంది అని నిర్మాతలు తెలిపారు. ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్‌మ్యాడ్‌సన్, షాలినిపాండే, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: షానియల్ డియో, సంగీతం: గోపీసుందర్, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: కోన వెంకట్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాణ సంస్థలు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్, కథ, దర్శకత్వం: కోన వెంకట్.

762

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles