ఆర్‌ఆర్‌ఆర్ కోసం..?

Sat,May 11, 2019 11:37 PM

ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకుడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దశలో వుంది. కొమరంభీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ కీలక అతిథి పాత్రపోషిస్తున్నారు. అలియాభట్ ఓ కథానాయికగా నటిస్తోంది. మరోనాయికగా నిత్యామీనన్‌ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చిత్ర బృందం ఈ విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ఇదిలా వుండగా పిరియాడిక్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలోని కీలక మలుపులో వచ్చే అతిథి పాత్ర కోసం అనుష్కని చిత్ర వర్గాలు సంప్రదించాయని, పాత్ర ప్రాధాన్యత నచ్చి ఆమె కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అనుష్క ప్రస్తుతం హేమంత్ మధుకర్ రూపొందిస్తున్న థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ సైలెన్స్‌లో నటిస్తున్నది. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది.

4279

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles