భక్తిప్రధాన చిత్రంలో..


Sun,March 10, 2019 11:57 PM

Anushka to act in Lord Ayyappa movie

భాగమతి తర్వాత దాదాపు సంవత్సరకాలం పాటు సినిమాలకు విరామాన్నిచ్చింది అగ్ర కథానాయిక అనుష్క. ఆ మధ్యన కాస్త ఒళ్లు చేసి అభిమానుల్ని కలవరపెట్టిన ఈ అమ్మడు విదేశాల్లో ప్రత్యేక చికిత్స ద్వారా బరువు తగ్గి స్లిమ్‌గా తయారైంది. కొద్దిరోజుల క్రితం సోషల్‌మీడియాలో విడుదల చేసిన ఫొటోల్లో అనుష్క పూర్తి బరువు తగ్గి నవయవ్వనిలా కనిపించింది. ప్రస్తుతం అనుష్క తెలుగులో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. హేమంత్ మధుకర్ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించబోతున్నారు. ఇదిలావుండగా అనుష్క మరో భారీ చిత్రానికి అంగీకారం తెలిపినట్లుగా సమాచారం. ప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు సంతోష్‌శివన్ దర్శకత్వంలో శబరిమలై అయ్యప్ప జీవితకథ ఆధారంగా ఓ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో అనుష్క ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. శ్రీగోకులమ్‌గోపాలన్ నిర్మించనున్నారు. తమిళ, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు.

1498

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles