మహేష్‌తో ప్రత్యేక గీతం?


Sun,July 16, 2017 11:06 PM

Anushka
బెంగళూరు సోయగం అనుష్కకు ప్రత్యేక గీతాల్లో నర్తించడం కొత్తేమి కాదు. పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్‌తో ఆకట్టుకుందీ సుందరి. తాజాగా ఈ అమ్మడు మహేష్‌బాబు సరసన ఓ ప్రత్యేక గీతాన్ని చేయబోతుంది. ఖలేజా చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ జోడీ మరోమారు వెండితెరపై సందడి చేయబోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే...కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడిగా భరత్ అనే నేను చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కైరా అద్వాని కథానాయిక. ఈ సినిమాలో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే ప్రత్యేక గీతాన్ని డిజైన్ చేస్తున్నారట. ఇందులో నటించడానకి చిత్ర బృందం అనుష్కను సంప్రదించిందని తెలిసింది. ఆమె సుముఖంగానే వుందని సమాచారం. బాహుబలి సిరీస్‌తో ప్రేక్షకుల్ని మెప్పించిన అనుష్క ప్రస్తుతం భాగ్‌మతి చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది.

650

More News

VIRAL NEWS