చూడచక్కగా..

Mon,February 11, 2019 11:44 PM

చక్కనమ్మ చిక్కితేనే అందం అంటారు. నాజూకు సోయగాలనే ఇప్పుడు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈ తత్వాన్ని గ్రహించినట్లుంది సీనియర్ నాయిక అనుష్క. సోషల్‌మీడియాలో దర్శనమిచ్చిన అనుష్క తాజా ఫొటోలు అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశాయి. కెరీర్ తొలినాళ్లలో మెరుపుతీగలా కుర్రకారు హృదయాల్ని మురిపించిన ఈ కన్నడ కస్తూరి కెరీర్‌లో క్రమంగా అగ్ర కథానాయికగా ఎదిగింది. అయితే కొద్దికాలంగా ఈ అమ్మడు ఒళ్లు చేయడంతో అభిమానులు కలవరపడ్డారు. భాగమతి తర్వాత దాదాపు సంవత్సకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది అనుష్క. బరువు తగ్గడానికి విదేశాల్లో ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నదనే వార్తలొచ్చాయి. తాజా ఫొటోలు ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. స్లిమ్‌గా తయారై నవయవ్వనిలా కనిపిస్తున్న అనుష్క ఫొటోలు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అనుష్క తెలుగులో ఓ చిత్రాన్ని అంగీకరించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన వెంకట్ నిర్మించనున్న ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకుడు.

1159

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles