ప్రభాస్‌ను అన్నయ్య అనలేను!


Thu,January 18, 2018 11:25 PM

bhagamati
అనుష్క ఎప్పుడు మీడియా ముందుకెళ్లిన పెళ్లి గురించిన ప్రశ్నే ఎదురవుతున్నది. బుధవారం చెన్నైలో భాగమతి చిత్ర తమిళ ఆడియో ఆవిష్కరణ వేడుక జరిగింది. ఈ సందర్భంగా పెళ్లితో పాటు ప్రభాస్‌తో తనకున్న సాన్నిహిత్యం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది అనుష్క. ప్రతి ఒక్కరూ తన వివాహం గురించే అడుగుతున్నారని, తాను మాత్రం ఆ విషయం గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదని చెప్పింది. పెళ్లి గురించి ప్రస్తుతానికైతే ఎలాంటి ఆలోచనలు లేవు. నా పెళ్లి గురించి మీకు అంతలా ఆసక్తి వుంటే నాకోసం మీరే అబ్బాయిని వెతికి పెట్టండి అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. ప్రభాస్‌తో తనకున్న సాన్నిహిత్యం గురించి చెబుతూ ప్రభాస్ నాకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమే. అయితే అతన్ని అన్నయ్య అని పిలవలేను. అందరు అబ్బాయిల్ని మనం అన్నయ్యగా భావించలేం కదా అని చెప్పుకొచ్చింది. తనపై వచ్చే గాసిప్స్ గురించి అస్సలు పట్టించుకోనని పేర్కొంది అనుష్క.

2434

More News

VIRAL NEWS