‘మహానటి’లో అనుష్క?


Thu,April 20, 2017 12:20 AM

anushka-shetty
తెలుగు తెరపై తిరుగులేని మహానటిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు సావిత్రి. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా మహానటి పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో స్వప్న సినిమా పతాకంపై సి.ఆశ్వనీదత్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్న ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తిసురేష్, సావిత్రి జీవిత కథని రాసే మహిళా పాత్రికేయురాలిగా సమంత నటించనున్నారు. కాగా ఓ కీలక పాత్ర కోసం ఇటీవల చిత్ర వర్గాలు హీరోయిన్ అనుష్కను సంప్రదించారని, ఆమెతో పాటు మరో పాత్ర కోసం ప్రకాష్‌రాజ్‌ని కూడా కలిసారని, స్క్రిప్ట్ విన్న ఇద్దరు కూడా ఈ చిత్రంలో నటించడానికి సుముఖతను వ్యక్తం చేశారని సమాచారం. సావిత్రి సినీ ప్రయాణం, తమిళ నటుడు జెమినీగణేషన్‌తో ప్రేమ, పెళ్లికి దారితీసిన సంఘటనలతో పాటు 40వ దశకం నుంచి 80వ దశకం ప్రారంభం వరకు సాగిన సావిత్రి జీవితంలోని పలు కోణాలను, మాయాబజార్, మిస్సమ్మ చిత్రాలకు సంబంధించిన విశేషాల్ని ఈ చిత్రంలో చూపించనున్నట్లు తెలిసింది.

1347

More News

VIRAL NEWS