మన్మథుడికి జోడీగా..?

Sun,February 17, 2019 11:41 PM

భాగమతి విజయం తరువాత కొంత విరామం తీసుకుంది అనుష్క. గత కొన్ని రోజులుగా బరువు తగ్గడం కోసం సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆమె ఇటీవల మాధవన్ నటించనున్న ఓ ద్విభాషా చిత్రాన్ని అంగీకరించారు. ప్రస్తుతం బరువు తగ్గి నాజూకుగా తయారైన అనుష్క మరో చిత్రాన్ని అంగీకరించినట్లు తెలిసింది. మన్మథుడు చిత్రానికి సీక్వెల్ చేసే ప్రయత్నాల్లో వున్నారు నాగార్జున. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై తెరపైకి రానున్న ఈ సినిమా మార్చి 12న లాంఛనంగా ప్రారంభంకానుంది. ఇందులో ఓ నాయికగా ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్‌ను ఖరారు చేశారు. ప్రధాన నాయికగా పలువురి పేర్లను పరిశీలించిన నాగార్జున ఫైనల్‌గా అనుష్క ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ సినిమాను అత్యధిక భాగం యూరప్‌లో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారని, అత్యున్నత సాంకేతికత విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని చిత్ర వర్గాల సమాచారం.

2752

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles