అనుష్క హారర్ థ్రిల్లర్

Thu,January 17, 2019 12:25 AM

భాగమతి తర్వాత అనుష్క చిత్రమేది సెట్స్‌మీదకు రాలేదు. ఆమె కథానాయికగా నటించనున్న తాజా చిత్రం మార్చి నెలలో అమెరికాలో ప్రారంభంకానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తారు. మాధవన్, అంజలి, షాలినిపాండే ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. హారర్ థ్రిల్లర్ కథాంశమిది. తెలుగు, తమిళం, హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులతో భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నాం. మార్చి నెలలో చిత్రీకరణ ప్రారంభించి ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అని చిత్ర బృందం పేర్కొంది. కోన వెంకట్, గోపీసుందర్, షనీల్ డియో, గోపిమోహన్, నీరజ కోన ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్.

1623

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles