భలే ఛాన్సులే..!


Tue,December 12, 2017 01:25 PM

anu-emmanuel
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ భారీ మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నారని వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయని పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ బాక్సర్స్ పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో అను ఇమ్మాన్యుయెల్ కథానాయికగా నటించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నది. అనతికాలంలోనే యువతలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. మజ్నూ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమై ఈ సుందరి ప్రస్తుతం పవన్‌కల్యాణ్ సరసన అజ్ఞాతవాసి చిత్రంలో, అల్లు అర్జున్‌తో కలిసి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంలో నటిస్తున్నది. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న శైలజారెడ్డి అల్లుడు చిత్రంలో కూడా ఆమే కథానాయిక. అరంగేట్రం చేసిన తక్కువ సమయంలోనే రాజమౌళి చిత్రంలో అవకాశం దక్కించుకోవడం విశేషమని చెప్పుకుంటున్నారు. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలయికలో రానున్న ప్రతిష్టాత్మక చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సెట్స్‌మీదకు వెళ్తుందని సమాచారం.

4675

More News

VIRAL NEWS