అన్నపూర్ణమ్మగారి మనవడు గీతాలు

Fri,November 22, 2019 11:55 PM

అన్నపూర్ణ, మాస్టర్ రవితేజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం అన్నపూర్ణమ్మగారి మనవడు. నర్రా శివనాగేశ్వరరావు దర్శకుడు. ఎమ్మెన్నార్ చౌదరి నిర్మాత. ఈ చిత్ర గీతాల్ని గురువారం తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ కుటుంబ అప్యాయతలు, పల్లెటూరి అనుబంధాల్ని ఆవిష్కరించే చిత్రమిది. స్వచ్ఛమైన పల్లె వాతావరణాన్ని ఈ సినిమాలో చూపించాం. అమ్మమ్మ పాత్రలో అన్నపూర్ణమ్మ, మనవడి పాత్రలో మాస్టర్ రవితేజ చక్కగా ఒదిగిపోయారు. సీనియర్ నటి జమునగారు అక్కినేని అనసూయమ్మ పాత్రలో ఆకట్టుకుంటారు అన్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ఆవిష్కరిస్తూ ఈ సినిమా తీశాం. డిసెంబర్‌లో విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నాం అని నిర్మాత తెలిపారు. భిన్న భావోద్వేగాలు కలబోసిన పాత్రలో నటించడం ఆనందంగా ఉందని మాస్టర్ రవితేజ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

181

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles