‘లీసా’.. కొత్త అనుభూతి


Mon,May 20, 2019 04:13 AM

Anjalis Lisa movie all set to evoke fear from May 24

నేను నటించిన తొలి త్రీడీ సినిమా ఇది. నటిగా సరికొత్త అనుభూతిని మిగిల్చింది. హారర్ కథాంశాల్ని ఇష్టపడే ప్రతి ఒక్కరిని ఈ సినిమా మెప్పిస్తుంది అని చెప్పింది అంజలి. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం లీసా. రాజు విశ్వనాథ్ దర్శకుడు. ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 24న విడుదలకానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన నటుడు శివాజీరాజా ఆడియోతో పాటు ప్రచార చిత్రాన్ని విడుదలచేశారు. అంజలి మాట్లాడుతూ నా కెరీర్‌లో ముఖ్యమైన సినిమా ఇది. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుంది. నవ్విస్తూనే ప్రతి ఒక్కరిని భయపెడుతుంది.

lisa
లీసా అనే యువతి చుట్టూ సాగుతుంది అని తెలిపారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ షాపింగ్‌మాల్, జర్నీ తర్వాత మరోసారి అంజలి నటించిన సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించడం ఆనందంగా ఉంది. హారర్ ఇతివృత్తంతో రూపొందిన సినిమా ఇది. కథ నచ్చి తెలుగులో విడుదల చేస్తున్నాను. వేసవిలో మరో బ్లాక్‌బస్టర్ సినిమా అవుతుందనే నమ్మకం ఉంది అని తెలిపారు. దర్శకుడిగా తన తొలి సినిమా ఇదని, పూర్తి రియల్ త్రీడీలో ఈ సినిమా చేశామని రాజు విశ్వనాథ్ చెప్పారు.

710

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles