జై ప్రేమలో లేను!


Thu,February 7, 2019 12:56 AM

Anjali Reacts On Relationship with Jai

తమిళ హీరో జైతో తాను డేటింగ్‌లో ఉన్నట్లు ఎవరితో చెప్పలేదని తెలిపింది అంజలి. జై, అంజలి ప్రేమాయణంపై తమిళ చిత్రసీమలో చాలా కాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి.ఎంగయుమ్ ఎప్పోదుమ్(తెలుగులో జర్నీ) సినిమాలో నటిస్తున్న సమయంలో వీరిమధ్య మొదలైన పరిచయం ప్రణయంగా మారినట్లు వార్తలు వినిపించాయి. ఒకరి పుట్టినరోజున మరొకరు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకోవడమే కాకుండా తామిద్దరు సన్నిహితంగా కలిసి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకోవడంతో జై, అంజలి డేటింగ్‌లో ఉన్నది నిజమేనని అంతా అనుకున్నారు. దోశ ఛాలెంజ్‌లో జంటగా పాల్గొనడంతో వీరు పెళ్లిచేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రేమవార్తలపై జైతో పాటు అంజలి ఇన్నాళ్లు పెదవి విప్పలేదు. ఇటీవల ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది అంజలి. జైతో తాను ప్రేమలో లేనని చెప్పింది. జైని నేను ప్రేమిస్తున్నట్లుగా అనేక వార్తలు వచ్చాయి. ఓ దశకు వచ్చాకా అవే ఆగిపోయాయి. జైతో నేను ప్రేమలో ఉన్నట్లు ఎవరితో చెప్పలేదు. తొలినాళ్లలో ఇలాంటి గాసిప్స్ నాపై వచ్చినప్పుడు ఏడ్చేదాన్ని. ఇప్పుడవన్నీ అలవాటైపోయాయి అని తెలిపింది.

2216

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles