ఆనందభైరవి సాహసం


Thu,June 13, 2019 12:59 AM

anjali is playing the lead role in anandabhiravi

అంజలి, రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆనందభైరవి. కర్రీ బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. హరివేన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఇటికేల రమేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. అరుణ్ ఆదిత్ కీలక పాత్రధారి. తొలి షెడ్యూల్ వైజాగ్‌లో పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ విభిన్నమైన ఇతివృత్తంతో తెరకెక్కుతున్న మహిళా ప్రధాన చిత్రమిది. వైజాగ్‌లో జరిగిన తాజా షెడ్యూల్‌లో అంజలి, అరుణ్ ఆదిత్‌ల లవ్‌ట్రాక్‌తో పాటు పృథ్వీ, బ్రహ్మాజీ, గుండు సుదర్శన్, జయవాణిలపై హాస్య సన్నివేశాల్ని తెరకెక్కించాం. హైదరాబాద్‌లో జరిగే తదుపరి షెడ్యూల్‌లో రాయ్‌లక్ష్మీపై పోరాట ఘట్టాలను చిత్రీకరించనున్నాం అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ఆనందిని అనే మధ్య తరగతి యువతిగా అంజలి హావభావాలు, పాత్ర చిత్రణ ఆకట్టుకుంటాయి. ఈ పాత్రను ఎంతో ప్రేమించి చేస్తున్నారు. చిత్రీకరణలో అంజలికి గాయాలైనా లెక్కచేయకుండా షూటింగ్‌లో పాల్గొని వృత్తి పట్ల తన అంకితభావాన్ని చాటుకున్నారు అని తెలిపారు. సుమన్, బ్రహ్మాజీ, మురళీశర్మ, జయప్రకాష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: పీజీ విందా.

595

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles