హైదరాబాద్ అమ్మాయితో పెళ్లి..


Wed,January 16, 2019 11:44 PM

Anisha Alla And Vishal Are Engaged Will Announce Wedding Date Soon

హీరో విశాల్ పెళ్లిపీటలెక్కనున్నారు. హైదరాబాద్‌కు చెందిన అనీషాను వివాహమాడనున్నారు. కాబోయే శ్రీమతితో దిగిన ఓ ఫొటోను బుధవారం ట్విట్టర్ ద్వారా పంచుకున్న ఆయన త్వరలో తమ పెళ్లి తేదీని వెల్లడిస్తామని పేర్కొన్నారు. అనీషాను పెళ్లిచేసుకోబోతున్నాను. చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో చోటుచేసుకుంటున్న పెద్ద మార్పు ఇది అని విశాల్ తెలిపారు. కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సరైన తోడు దొరికింది. విశాల్ మంచి మనసు నన్ను ఆకట్టుకున్నది అని అనీషా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చెప్పింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె అయిన అనీషా నటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందిన పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి చిత్రాల్లో సహాయనటిగా కనిపించారు. ఈ నెలలోనే హైదరాబాద్‌లో విశాల్, అనీషా నిశ్చితార్థం నిర్వహిస్తామని, పెళ్లికూడా ఇక్కడే జరుపనున్నామని విశాల్ తండ్రి జీకే రెడ్డి చెప్పారు.

3260

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles