జూన్‌లో వినోదాలయాత్ర షురూ


Mon,April 16, 2018 12:06 AM

Anil Ravipudi F2 starring Venkatesh Varun Tej starts rolling from June

venkatesh
వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా తెరకెక్కనున్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్2(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి గత చిత్రాల తరహాలోనే ఆద్యంతం వినోదభరితంగా ఈ సినిమా రూపొందనుంది. కామెడీతో పాటు కుటుంబ అనుబంధాలు, ప్రేమ అంశాల మేళవింపుతో దర్శకుడు చక్కటి కథను సిద్ధం చేసినట్లు తెలిసింది. జూన్ నెలలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు అనిల్‌రావిపూడి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. చిత్రీకరణ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మల్టీస్టారర్‌లో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

1146

More News

VIRAL NEWS

Featured Articles