అసిస్టెంట్ డైరెక్టర్ కథనం!

Sat,March 9, 2019 11:59 PM

అనసూయ, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం కథనం. రాజేష్ నాదెండ్ల దర్శకుడు. మంత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీగాయత్రి ఫిల్మ్స్ పతాకంపై బి. నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. క్షణం, రంగస్థలం చిత్రాల తరువాత ఆ స్థాయిలో అనసూయకు పేరుతెచ్చే చిత్రమిది. ఈ సినిమాతో ఆమె హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారు. ఇందులో ఆమె అసిస్టెంట్ డైరెక్టర్‌గా కొత్త తరహా పాత్రలో కనిపిస్తారు. విజయవంతమైన చిత్రాల పంపిణీదారుడిగా పేరుతెచ్చుకున్న నరేంద్రరెడ్డి ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు. ఆయనది లక్కీ హ్యాండ్. ఆయన చేసిన ప్రతి సినిమా విజయాన్ని సాధించింది. ఆ కోవలో మా సినిమా కూడా హిట్ అవుతుందనే నమ్మకముంది అన్నారు. అనసూయ నటించిన ప్రతి సినిమా విజయాన్ని సాధించింది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని నిర్మాత తెలిపారు. రణధీర్, ధన్‌రాజ్, వెన్నెల కిషోర్, పృథ్వీ, సమీర్, ముఖ్తార్‌ఖాన్, రామరాజు, జ్యోతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, రచన:రాజేంద్ర భరద్వాజ్, ఎడిటింగ్: ఎస్.బి. ఉద్ధవ్, ఆర్ట్‌ఐ కె.వి.రమణ, ఛాయాగ్రమణం: సతీష్ ముత్యాల, లైన్ ప్రొడ్యూసర్: ఎమ్.విజయ చౌదరి.

681

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles