రాజకుమారుడి ప్రేమకథ


Tue,September 25, 2018 11:33 PM

Anaganaga O Rajakumarudu Movie Audio Function

సమాజానికి ఉపయుక్తమయ్యే చక్కటి సందేశాత్మక కథాంశంతో నిర్మాత రాఘవులు ఈ చిత్రాన్ని రూపొందించారు అని అన్నారు తెలంగాణ ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు. నవీన్‌బాబు, సంజన జంటగా నటిస్తున్న చిత్రం అనగనగా ఓ రాజకుమారుడు. షేర్ దర్శకుడు. పీవీ రాఘవులు నిర్మాత. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర గీతాలను లింగపల్లి కిషన్‌రావు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి విడుదలచేశారు. దర్శకుడు షేర్ మాట్లాడుతూ యూత్‌పుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. అంతర్లీనంగా మంచి సందేశం ఉంటుంది షేర్ ప్రతిభావంతుడైన దర్శకుడని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ పేర్కొన్నారు.

813

More News

VIRAL NEWS