నవతరం పోకడలతో..


Wed,December 12, 2018 11:23 PM

Anaganaga o premakatha on dec 14th Release

విరాజ్. జె. అశ్విన్, రిద్దికుమార్, రాధా బంగారు నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం అనగనగా ఓ ప్రేమకథ. థౌజండ్ లైట్స్ మీడియా పతాకంపై కె.ఎల్.ఎన్ రాజు నిర్మిస్తున్నారు. ప్రతాప్ తాతంశెట్టి దర్శకుడు. ఈ నెల 14న ఈ చిత్రం విడుదలకానుంది. ఇటీవల హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. నిర్మాత కె.ఎల్.ఎన్ రాజు మాట్లాడుతూ నవతరం పోకడల కారణంగా తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఏ విధంగా దూరం పెరుగుతుందనే కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. తప్పుదోవలో అడుగులు వేస్తున్న తన కూతురును సరైన దారిలోకి నడిపించడానికి ప్రయత్నించే ఓ తండ్రి కథ ఇది. వేణు కామెడీ ప్రధానాకర్షణగా ఉంటుంది. గీతా ఆర్ట్స్ ద్వారా తెలంగాణ, ఆంధ్రా రాష్ర్టాల్లో ఈ సినిమాను విడుదలచేస్తున్నాం అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ రోజుల్లో చిన్న సినిమా తీయడం చాలా కష్టం. దానిని నిలబెట్టడం ఇంకా కష్టం. కానీ కొత్తవాళ్లమైన మమ్మల్ని నమ్మి ధైర్యంగా కె.ఎల్.ఎన్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుంది అని చెప్పారు. సూర్య అనే యువకుడిగా తన పాత్ర విభిన్నంగా సాగుతుందని విరాజ్.జె. అశ్విన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రిద్దికుమార్, కాశీవిశ్వనాథ్, కె.సి. అంజన్ తదితరులు పాల్గొన్నారు.

841

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles