ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నా!

Mon,November 11, 2019 12:12 AM

ప్రస్తుతం నా కెరీర్ అత్యుత్తమ దశలో ఉంది. నా గమ్యమేమిటో ఇంకా నిర్ణయించుకోలేదు కానీ.. ప్రయాణాన్ని మాత్రం పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నా అని చెప్పింది కియారా అద్వాణీ. భరత్ అనే నేను వినయ విధేయ రామ చిత్రాలతో తెలుగు చిత్రసీమలో మంచి గుర్తింపును సంపాదించుకుందీ ఢిల్లీ భామ. బాలీవుడ్‌లో భారీ అవకాశాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడు కథానాయికగా నటించిన కబీర్‌సింగ్ (తెలుగు అర్జున్‌రెడ్డి రీమేక్) మూడొందల కోట్ల క్లబ్‌లో నిలిచింది. కెరీర్‌లో తొలినాళ్లలో అంతటి భారీ విజయం సాధించిన సినిమాలో భాగమవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పిందీ సుందరి. అయితే కెరీర్ ఆరంభంలో అవకాశాల విషయంలో తీవ్రంగా నిరుత్సాహపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని పేర్కొంది. నా తొలి చిత్రం ఫగ్లీ పరాజయం పొందండంతో అవకాశాలు మృగ్యమైపోయాయి. ఓ దశలో ఎటు తోచక ఇంటిపట్టునే ఉండిపోయేదాన్ని. భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే సందిగ్ధం వెంటాడేది. ఆ సమయంలో అవకాశాల్ని మనమే సృష్టించుకోవాలి. అన్వేషణ ఆపకూడదు. ప్రయత్నాలు ఏదో ఒకరోజు ఫలిస్తాయి అంటూ అమ్మ చెప్పిన మాటలు నాలో స్ఫూర్తినింపాయి అని చెప్పింది కియారా అద్వాణీ. ప్రస్తుతం ఈ భామ హిందీలో నాలుగు చిత్రాల్లో నటిస్తున్నది.

434

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles