కొత్త ప్రయాణం ప్రారంభం


Thu,January 3, 2019 01:37 AM

Amy Jackson announces engagement to George Panayiotou in New Year surprise for fans

ప్రస్తుతం కథానాయికలంతా పెళ్లిబాట పడుతున్నారు. తమ ప్రణయ బంధాల్ని పరిణయంగా మార్చుకుంటూ ఏడడుగులు వేసేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ప్రియాంకచోప్రా, దీపికా పదుకునే ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తాజాగా కథానాయిక అమీజాక్సన్ పెళ్లి పీటలెక్కబోతున్నది. చిరకాల మిత్రుడు, ప్రియుడు జార్జ్ పనయోటోను ఆమె పెళ్లాడనున్నది. లండన్‌కు చెందిన వ్యాపారవేత్త పనయోటోతో చాలా కాలంగా ప్రేమలో ఉన్నది అమీజాక్సన్. ప్రస్తుతం నూతన సంవత్సర వేడుకల్ని ఆఫ్రికాలోని జాంబియా దేశంలో జరుపుకుంటున్నది ఈ ప్రేమజంట. జనవరి 1న వీరి నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రియుడు పనయోటో తన బుగ్గపై ప్రేమగా ముద్దిస్తున్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నది అమీజాక్సన్. మా జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభమైంది. ప్రపంచంలోనే అత్యంత ఆనందాన్ని నాకు పంచుతున్నందుకు ధన్యవాదాలు. ఐ లవ్ యూ అంటూ వ్యాఖ్యానించింది. అయితే పెళ్లి తేదీని మాత్రం వెల్లడించలేదు అమీజాక్సన్.

1580

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles