అమృత వర్షిణి ప్రారంభం


Sat,November 17, 2018 02:39 AM

Amrutha Varshini Movie Launch

నందమూరి తారకరత్న, మేఘశ్రీ జంటగా నటిస్తున్న అమృత వర్షిణి చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. చాందిని క్రియేషన్స్ పతాకంపై శివప్రభు దర్శకత్వంలో నాగరాజు నెక్కంటి తెలుగు, కన్నడ భాషల్లో నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నారా రోహిత్ క్లాప్‌నివ్వగా, హీరో శ్రీకాంత్ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. యాక్షన్, సెంటిమెంట్ అంశాలుంటాయి. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటుంది. తారకరత్న పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుంది అన్నారు. ఈ నెల 20న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. చిక్ మంగుళూరులో సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తిచేస్తాం అని నిర్మాత తెలిపారు. ఈ సినిమాలో తాను సైకియాట్రిస్ట్ పాత్రలో నటిస్తున్నానని కథానాయిక చెప్పింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సభాకుమార్; సంగీతం: జెస్సీగిఫ్ట్, మాటలు, సహదర్శకత్వం: సతీష్‌కుమార్, సహనిర్మాత: మంజునాథ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివప్రభు.

1771

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles