తెలుగు దర్శకులు నచ్చలేదు!

Thu,February 7, 2019 12:30 AM

తెలుగు సినిమాల్లో నటించడం తనకు ఇష్టం లేదని తెలిపింది అమృతారావు. మహేష్‌బాబు హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం అతిథి. 2007లో విడుదలైన ఈ సినిమా తరువాత అమృతారావు మరో తెలుగు చిత్రంలో కనిపించలేదు. దీనికి కారణం తెలుగు దర్శకులే అంటూ ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ నేను అతిథి చిత్రంలో నటిస్తున్న సమయంలో వరుసగా మూడు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. కానీ నేను అంగీకరించలేదు. కారణం టాలీవుడ్ దర్శకులు హీరోయిన్ పాత్రలను చూపించే విధానం నాకు నచ్చకపోడమే. వారిని కేవలం వస్తువులుగానే చూపిస్తారు. ఎలాంటి ప్రాధాన్యతనివ్వరు. అలాంటి పాత్రలు నాకు కరెక్ట్ కాదనిపించింది. అతిథిలో నా పాత్ర, మహేష్ పాత్రతో సమానంగా సాగుతుంది. అందుకే ఆ చిత్రాన్ని చేశాను. చిత్రీకరణ సమయంలో మహేష్ కుటుంబంతో బాగా కలిసిపోయాను. చిత్రీకరణ జరుగుతున్న రోజుల్లో మహేష్ ఇంటి నుంచే భోజనం వచ్చేది. ఓ సారి నమ్రత మా కోసం బ్రౌన్ రైస్ వండి పంపించిన సంఘటన నాకు ఇంకా గుర్తే అని తెలిపింది. అమృతకు బాలీవుడ్‌లో అవకాశాలు పెద్దగా రాలేదు. నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన ఠాక్రే చిత్రంలో ఆమె ఠాక్రే సతీమణి మీనా తాయి పాత్రలో నటించారు. ఆమె పాత్రకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.

1147

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles