అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మ గీతాలు

Mon,September 30, 2019 12:02 AM

రోహిత్‌చంద్ర, డాక్టర్ ఏపీ చారి, విజయలక్ష్మి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం అమ్మలగన్న అమ్మ మూలపుటమ్మ. కళాసాధన కృష్ణ దర్శకుడు. రవి మూలకలపల్లి సంగీతాన్నందించిన ఈ చిత్ర గీతాలు ఇటీవల హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఈ సినిమా అంతా ఒక ఇంటిలో తెరకెక్కించాం. అవసరమైన చోట గ్రాఫిక్స్‌ను ఉపయోగించాం. ఇందులో ఐదు కథలుంటాయి. అవన్నీ ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. చెడుపై మంచి ఎలా గెలిచిందన్నదే చిత్ర ఇతివృత్తం అన్నారు. మన ప్రాచీన దేవతలు చాలా శక్తివంతమైన వారు. ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటూ ఉంటాం. కానీ ఆ దేవత ఎవరు? ఆమె శక్తి ఏమిటనే విషయం చాలా మందికి తెలియదు. వారి గొప్పదనాన్ని ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాం అని చిత్ర నిర్మాత డాక్టర్ ఏపీ చారి తెలిపారు.

221

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles