అమితాబ్, రజనీ అతిథులుగా...

Wed,November 6, 2019 12:16 AM

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్‌ఎఫ్‌ఐ)50వ ఎడిషన్ ప్రారంభోత్సవ వేడుకలకు దిగ్గజ నటులు అమితాబ్‌బచ్చన్, రజనీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. గోవా వేదికగా ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు ఈ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగనున్నది. 2014లో జరిగిన 45వ ఇఫీ వేడుకల్లో పాల్గొన్న ఈ అగ్ర నటులు మరోసారి ఈ ఏడాది చలనచిత్రోత్సవంలో సందడి చేయబోతున్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయ సినీ రంగానికి చేసిన అసమాన సేవలకు గాను ఐకాన్ ఆఫ్ గోల్డన్‌జూబ్లీ పురస్కారంతో రజనీకాంత్‌ను సత్కరించబోతున్నారు. అమితాబ్ బచ్చన్ నటించిన సినిమాల్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ చలన చిత్రోత్సవంలో 76 దేశాలకు చెందిన 190కిపైగా సినిమాల్ని ప్రదర్శించనున్నారు. 24 ఆస్కార్ నామినేషన్స్ చిత్రాలతో పాటు యాభై ఏళ్ల క్రితం రూపొందిన కొన్ని అరుదైన సినిమాలు వీక్షకుల్ని అలరించబోతున్నాయి. తొలిసారి కొంకణీ చిత్రాలకు ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్థానాన్ని కల్పించారు.
Amitabh-Bachchan

438

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles