గోసాయి వెంకన్న


Fri,October 12, 2018 12:10 AM

Amitabh Bachchan First Look from Sye Raa Narasimha Reddy is Out and Its Intriguing

చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్‌బచ్చన్ నటిస్తున్నారు. గురువారం అమితాబ్‌బచ్చన్ జన్మదినాన్ని పురస్కరించుకొని చిత్రబృందం ఆయన ఫస్ట్‌లుక్ మోషన్‌పోస్టర్‌ను విడుదలచేసింది. ఈ పోస్టర్‌లో పొడవైన జుట్టు, గుబురుగడ్డం మీసంతో నుదుట తిలకం ధరించి రుషిలా కనిపిస్తున్నారు అమితాబ్‌బచ్చన్. ఈ సినిమాలో విజయ్‌సేతుపతి, సుదీప్, నయనతార, తమన్నా కీలక పాత్రలను పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

1890

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles