అమితాబ్‌కు గాయాలు...!


Sun,August 13, 2017 12:32 AM

amitabhh
థగ్స్ ఆఫ్ హిందోస్థాన్ చిత్ర షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్‌బచ్చన్ గాయపడ్డారు. ఆయన పక్కటెముకల్లో చిన్న చీలిక వచ్చిందని వైద్యులు ప్రకటించారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై చిత్ర బృందం ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. ప్రమాదానంతరం అమితాబ్ షూటింగ్‌లో పాల్గొన్నారు. ముంబయి వెళ్లిన తర్వాత తీయించుకున్న ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో ఆయన పక్కటెముకల్లో చిన్న ఫ్రాక్చర్ వున్నట్లు వైద్యులు గుర్తించారు. అమితాబ్ ఆరోగ్యం బాగానే వుందని, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే అంతా సర్దుకుంటుందని డాక్టర్లు తెలిపారు. అమీర్‌ఖాన్ కథానాయకుడిగా థగ్స్ ఆఫ్ హిందోస్థాన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ ఆచార్య దర్శకుడు. వచ్చే ఏడాది దీపావళి కానుకగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

671

More News

VIRAL NEWS