అమ్మ గొప్పతనంతో..


Tue,May 14, 2019 01:13 AM

Amani Amma Deevena movie completes shoot except for songs

ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అమ్మదీవెన. శివ ఏటూరి దర్శకుడు. ఎత్తరి గురువయ్య నిర్మిస్తున్నారు. టాకీపార్ట్ పూర్తయింది. నిర్మాత మాట్లాడుతూ అమ్మ గొప్పతనాన్ని చాటిచెప్పే చిత్రమిది. సృష్టికి మూలమైన అమ్మ లేకపోతే లోకం చీకటిమయం అవుతుందనే కథాంశంతో రూపొందిస్తున్నాం. ప్రతి తల్లి గర్వపడేలా ఉంటుంది. యథార్థ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిస్తున్నాం. ఆమని నటన మనసుల్ని కదిలిస్తుంది. షూటింగ్ తుదిదశకు చేరుకున్నది. ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే చివరి షెడ్యూల్‌లో పాటలను చిత్రీకరించనున్నాం. త్వరలో ఫస్ట్‌లుక్ విడుదల చేస్తాం అని తెలిపారు. పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.వి.హెచ్, కెమెరా: సిద్ధం మనోహర్.

798

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles