ఆ సీన్ భయపెట్టింది!


Mon,July 8, 2019 12:03 AM

amala paul before aadai i even thought of quitting the film industry

తమిళ చిత్రం అడైలో అమలాపాల్ ఎక్స్‌పోజింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవకాశాల కోసమే ఆమె ఇలాంటి సినిమాలు చేస్తున్నదంటూ పలువురు అభ్యంతరాల్ని వ్యక్తంచేస్తున్నారు. ఈ విమర్శలపై అమలాపాల్ ధీటుగానే స్పందించింది. సినిమాలు చూడకుండానే కొందరు తొందరపాటుతో తమ అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. నటీనటుల శ్రమను, కష్టాన్ని తగ్గిస్తూ మాట్లాడుతుంటారు అలాంటి వారి విమర్శలకు నేనెప్పుడూ విలువనివ్వను. వాటిని ఏ మాత్రం పట్టించుకోను. అడై నిజాయితీతో కూడిన ప్రయత్నం. తొలుత దర్శకుడు ఈ కథ గురించి చెప్పినప్పుడు స్ట్రెయిట్ సినిమా అంటే నమ్మలేకపోయాను. హాలీవుడ్ చిత్రం స్ఫూర్తితో కథ రాశారనిపించింది.

కథపై రత్నకుమార్‌కు ఉన్న పట్టు చూసి నమ్మకం కలిగింది అని తెలిపింది. అలాగే సినిమాలోని అర్ధ నగ్నంగా కనిపించే సన్నివేశం గురించి చెబుతూ తొలుత ఆ సీన్ గురించి దర్శకనిర్మాతలు చెప్పినప్పుడు ఆందోళన వద్దని వారితో చెప్పాను. కానీ ఆ సీన్ చిత్రీకరించే ముందు చాలా ఒత్తిడిగా ఫీలయ్యాను. సెట్స్‌లో ఏం జరుగుతుందో? ఆ సన్నివేశాన్ని ఎలా తీస్తారో? అనే భయాలు నాలో మొదలయ్యాయి. చిత్ర బృందంపై నమ్మకం ఉంచితేనే అలాంటి సన్నివేశాల్ని తెరకెక్కించగలమనిపించింది. అందుకే ధైర్యంతో వారిని నమ్మాను. 15 మంది యూనిట్ సభ్యుల మధ్య కట్టుదిట్టమైన భద్రతలో ఆ సీన్స్‌ను తెరకెక్కించాం అని తెలిపింది.

1022

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles