బ్యాక్ టు స్కూల్


Tue,March 12, 2019 11:53 PM

Amala Paul beach pics go viral

సినిమా చిత్రీకరణలు, ప్రచార వేడుకలతో తారల జీవితాలు తీరిక లేకుండా సాగిపోతుంటాయి. ఈ బిజీ లైఫ్ నుంచి విరామం దొరికితే విహారయాత్రలు, సాహసాలు చేయడానికి ఉవ్విళ్లూరుతారు. కొత్త విషయాల్ని నేర్చుకుంటూ కనిపిస్తుంటారు. ప్రస్తుతం కొత్త సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో సర్ఫింగ్ నేర్చుకుంటూ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నది అమలాపాల్. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. బ్యాక్ టు స్కూల్. అయితే ఈ సారి సర్ఫింగ్ పాఠశాలలో చేరాను. ఈ సాహసక్రీడను నేర్చుకుంటున్నాను అని తెలిపింది. జీవితంలో ఎదురయ్యే అన్ని కఠిన సవాళ్లు, ప్రశ్నలకు సముద్రానికి మించిన సమాధానం లేదు అంటూ పేర్కొన్నది. సర్ఫింగ్ బోట్ మీద షార్ట్ ధరించి చిరునవ్వులు చిందిస్తున్న అమలాపాల్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ మహిళా ప్రధాన చిత్రాలు, ప్రయోగాత్మక పాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నది అమలాపాల్.

1128

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles