సుకుమార్‌ సలహా పాటిస్తున్నా!


Thu,May 16, 2019 12:11 AM

Allu Sirish Stills From ABCD Movie Interview

ఘనమైన సినీ నేపథ్యం, వారసత్వం అన్ని ఉన్నా ఆరేళ్ల సినీ ప్రయాణంలో కేవలం ఐదు సినిమాలు మాత్రమే చేశారు అల్లు శిరీష్‌. కథాంశాలు, పాత్రల పరంగా నవ్యతకు ప్రాధాన్యతనిస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఏబీసీడీ’. తన నిజజీవితానికి దగ్గరగా ఉన్న కథ ఇదని, హీరో పాత్రలో తనను తాను చూసుకున్నానని చెబుతున్నారు అల్లు శిరీష్‌. సంజీవ్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ నెల 17న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌ అల్లు శిరీష్‌ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..

‘ఒక్కక్షణం’ తర్వాత రీమేక్‌ కథతో సినిమా చేయడానికి కారణం ఏమిటి?

మలయాళంలో దుల్కార్‌ సల్మాన్‌ నటించిన ‘ఏబీసీడీ’ చిత్రాన్ని రెండేళ్ల క్రితం చూశాను. చాలా నచ్చింది. ఈ సినిమాను తెలుగులో నేను రీమేక్‌ చేస్తే బాగుంటుందని రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌, మారుతితోపాటు ఇండస్ట్రీలోని పరిచయస్తులు, స్నేహితులు చాలా మంది చెప్పారు. వినోదం, భావోద్వేగాలు, ప్రేమ, నాటకీయత సమపాళ్లలో ఉండే చిత్రమిది. అమెరికా నుంచి ఇండియా వచ్చిన ఓ యువకుడి జీవితగమనానికి చక్కటి దృశ్యరూపంగా ఉంటుంది.

ట్రైలర్‌ చూస్తుంటే రాజకీయ అంశాలతో ముడిపడిన సినిమాలా అనిపిస్తున్నది?

హీరో పాత్రలో మార్పు తీసుకురావడానికి రాజకీయ పరమైన అంశాలు ఓ కారణంగా నిలుస్తాయి. అంతే తప్ప పూర్తిగా రాజకీయ నేపథ్యంతో ముడిపడిన సినిమా కాదిది.

ఈ సినిమాను చాలా మంది ‘పిల్లజమీందార్‌'తో పోల్చుతున్నారు. ప్రీ రిలీజ్‌ వేడుకలో నాని అదే మాటన్నారు. ఆ సినిమాతో ఏమైనా పోలికలు ఉంటాయా?

‘పిల్ల జమీందార్‌'తో ఎలాంటి పోలికలు ఉండవు. ఆ సినిమా తాత, మనవడి మధ్య ఛాలెంజ్‌ ప్రధానంగా సాగుతుంది. మా సినిమా తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగుతుంది. అమెరికా సంస్కృతికి అలవాటుపడిన ఓ కొడుకులో మార్పు కోసం తపించే ఓ తండ్రి కథ ఇది. ఇండియాలో ఓ మురికివాడలో నివసించే యువకుడు డబ్బు, మనిషి విలువ ఎలా తెలుసుకున్నాడన్నది ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా కథ విషయంలో ఇతర దర్శకుల సలహాలు తీసుకున్నాం అని అన్నారు?

రీమేక్‌ కథ కావడంతో తప్పులు జరగకుండా ఉండాలనే కృష్ణచైతన్య, బీవీఎస్వ్రి, గోపీమోహన్‌, పవన్‌సాధినేనితో పాటు అందరి సలహాలు తీసుకున్నాం. స్నేహితులుగానే అందరూ స్క్రిప్ట్‌ బాగా రావడానికి బాగా సహకరించారు. రచయిత సత్యానంద్‌ కొన్ని అవసరమైన మార్పులు చేశారు.

సినిమాల మధ్య చాలా గ్యాప్‌ తీసుకుంటున్నారు కారణం ఏమిటి?

నా సినిమాలన్నీ ఎందుకు ఆలస్యం అవుతున్నాయో తెలియదు. నా వైపు తప్పులు ఏమీ లేవు. సినిమాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండను. సరైన సమయంలో సినిమాల్ని పూర్తిచేయడానికి ప్రయత్నిస్తుంటాను. కానీ అనివార్య కారణాల వల్ల ‘ఒక్కక్షణం’తో పాటు ఈ సినిమా విడుదల ఆలస్యమైంది.

తదుపరి సినిమా విశేషాలేమిటి?

రొమాన్స్‌ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఓ ప్రేమకథతో తదుపరి సినిమా చేయబోతున్నాను. కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు.

స్క్రిప్ట్‌ను ఓ బైబిల్‌గా భావించి దానిని పూర్తిగా ఫాలో అవ్వకుండా వినోదం, ప్రేమ సన్నివేశాల్ని నటుడిగా నా శైలిలో ఇంప్రూవైజ్‌ చేయడానికి ప్రయత్నిస్తుంటాను. గతంలోఓ సందర్భంలో దర్శకుడు సుకుమార్‌ ‘దర్శకుడు చెప్పింది చేసేవాడు డీసెంట్‌ యాక్టర్‌..అలా చేయడంతో పాటు కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తూ దర్శకుల్ని సర్‌ప్రైజ్‌ చేసేవాడు గుడ్‌యాక్టర్‌ ’అని చెప్పారు. అప్పటి నుండి ఆయన సలహాను పాటిస్తున్నాను.

1821

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles