వేసవిలో కోలీవుడ్ ఎంట్రీ!


Thu,October 12, 2017 11:58 PM

Allu Arjuns Tamil debut with Linguswamy NOT shelved to kick off in mid 2018

alluarjun
అల్లు అర్జున్ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లు ఏడాది క్రితం ప్రకటన వెలువడింది. డీజేదువ్వాడ జగన్నాథం తర్వాత అల్లు అర్జున్ ఈ ద్విభాషా చిత్రాన్ని మొదలుపెడతారని అంతా ఆశించారు. కానీ ఆయన నా పేరు సూర్య చిత్రీకరణతో బిజీగా మారిపోయారు. మరోవైపు దర్శకుడు లింగుస్వామి తమిళంలో విశాల్ కథానాయకుడిగా సందకోజి-2 (పందెంకోడి-2) చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకొచ్చారు. దాంతో అల్లు అర్జున్ సినిమాపై అనుమానాలొచ్చాయి. సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది. తాజా సమాచారం ప్రకారం 2018 వేసవిలో ఈ సినిమా మొదలుకానున్నట్లు తెలిసింది. అల్లు అర్జున్ ఇమేజ్‌కు సరిపోయేలా దర్శకుడు లింగుస్వామి ఓ అద్భుతమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇటీవలే పూర్వ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు తెలిసింది. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో అల్లు అర్జున్ కోలీవుడ్‌లో అరంగేట్రం చేయనుండటం విశేషం.

2483

More News

VIRAL NEWS

Featured Articles