అల్లు అర్జున్ అలకనంద?


Wed,April 17, 2019 12:32 AM

Allu Arjuns next with Trivikram Srinivas titled Alakananda

అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. అల్లు అర్జున్ నటిస్తున్న 19వ చిత్రమిది. ఇటీవలే లాంఛనంగా పూజాకార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రానికి అలకనంద అనే పేరును చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. దర్శకుడు త్రివిక్రమ్ అ సెంటిమెట్ ప్రకారం ఈ టైటిల్‌ని ఖరారు చేసే ఆలోచనలో చిత్ర బృందం వున్నట్లు సమాచారం. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అతడు, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అఆ, అరవింద సమేత వంటి చిత్రాల టైటిల్స్ అ అక్షరంతో మొదలైన విషయం తెలిసిందే. సరికొత్త నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 24 నుంచి మొదలుకానుంది.

2638

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles