భాగ్యనగరంలో..


Thu,June 6, 2019 12:42 AM

allu arjun trivikram second schedule shoot starts pooja hegde joins shooting

అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత వీరిద్దరి కలయికలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చింది. బుధవారం నుంచి హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ను తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నేటి నుంచి పూజా హెగ్డే చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు తెలిపింది. అమేజింగ్ టీమ్‌తో కలిసి పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాను. క్రేజీ ఎంటర్‌టైనింగ్ సినిమా ఇది అంటూ పూజా హెగ్డే ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. కుటుంబ విలువలకు వినోదాన్ని మేళవిస్తూ త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

3474

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles