సంక్రాంతి బరిలో బన్నీ


Thu,July 11, 2019 12:33 AM

allu arjun trivikram movie will release sankranthi

అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్నది. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమాను 2020 సంక్రాంతికి విడుదలచేనున్నట్లు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. త్రివిక్రమ్ శైలిలో కుటుంబ బంధాలు, వినోదం, భావోద్వేగాల సమ్మిళితంగా ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. ఇందులో అల్లు అర్జున్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కనిపించనున్నట్లు తెలిసింది. ఇటీవల హైదరాబాద్‌లో ఆయనపై కీలక ఘట్టాలను చిత్రబృందం తెరకెక్కించింది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తుండగా పి.ఎస్. వినోద్ ఛాయాగ్రహణాన్ని సమకూర్చుతున్నారు.

1187

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles