అల్లు అర్జున్ సరసన?

Thu,February 7, 2019 12:38 AM

ఛలో, గీత గోవిందం చిత్రాలతో వరుస విజయాల్ని సొంతం చేసుకుంది కన్నడ సోయగం రష్మిక మందన్న. ఆమె నటిస్తున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. కాగా ఈ చిత్రం తరువాత రష్మిక అల్లు అర్జున్ సరసన నటించనున్నట్లు తెలిసింది. అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా బాలీవుడ్ సోయగం కియారా అద్వానీ నటించనుందని ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మికను చిత్ర బృందం ఎంపిక చేసే అవకాశం వుందని తెలిసింది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మార్చి మొదటి వారం నుంచి ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమాతో పాటు నితిన్ హీరోగా నటించనున్న భీష్మలోనూ నాయికగా రష్మిక ఎంపికైనట్లు టాలీవుడ్ న్యూస్.

3184

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles