షూటింగ్ షురువైంది!

Thu,April 25, 2019 12:00 AM

అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. యువ హీరో సుశాంత్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ బుధవారం మొదలైంది. ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు తమన్ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల కలయికలో వస్తున్న మూడవ చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. టబు, సత్యరాజ్, సునీల్, రాజేంద్రప్రసాద్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీశర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పీఎస్ వినోద్, సంగీతం: తమన్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పీడీవి ప్రసాద్.

1784

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles