నాటి రోజుల్ని గుర్తుకుతెస్తుంది

Tue,December 3, 2019 11:47 PM

‘చరిత్ర మరచిన యోధుల్ని సినీ పరిక్షిశమ వెలుగులోకి తీసుకొస్తున్నది. ‘సైరా’తో పాటు ‘మామాంగం’ ఆ కోవకు చెందిన సినిమానే. ఈ చారివూతక చిత్రాన్ని మా సంస్థ ద్వారా తెలుగులో విడుదలచేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు అల్లు అరవింద్. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మామాంగం’. పద్మకుమార్ దర్శకుడు. వేణు కున్నపిల్లి నిర్మాత. ఈ నెల 12న విడుదలకానుంది. తెలుగు ట్రైలర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ‘పదేళ్ల క్రితం పవన్‌కల్యాణ్‌తో తీయబోయే సినిమాలో విలన్ పాత్రను చేయగలరా అని మమ్ముట్టిని అడిగాను. ఇదే ప్రశ్నను చిరంజీవిని అడగగలరా అంటూ ఆయన తిరిగి నన్ను ప్రశ్నించారు. మమ్ముట్టి వ్యక్తిత్వానికి అది నిదర్శనం’ అని పేర్కొన్నారు. మమ్ముట్టి మాట్లాడుతూ ‘మాటలకందని ప్రయాణమిది. 16-18వ శతాబ్దం నాటి కథతో ఈ సినిమాను తెరకెక్కించాం. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మామాంగం అనే ఉత్సవం నేపథ్యంలో ఉత్కం ఉంటుంది. ఈ సినిమాలోని పోరాట ఘట్టాలు, సెట్స్‌లో ఎక్కడ కృతిమత్వం కనిపించదు. పీరియాడిక్ వాతావారణాన్ని సహజంగా పునఃసృష్టించాం. ఆనాటి రోజుల్లో ప్రతి ఒక్కరిని విహరించేలా చేస్తుంది. అన్ని భాషల వారికి కనెక్ట్ అవుతుంది’ అని అన్నారు.

441

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles