హృదయాల్ని గెలుస్తుంది!


Sun,June 17, 2018 11:35 AM

Allari Naresh SUPER PUNCH on Sri Chaitanya Ads Jambalakidi pamba Pre Release Event Cinema Politics

చిత్ర బృందమంతా ఎంతో కష్టపడి, అంకితభావంతో ఈ సినిమా చేశారు. జంబలకిడిపంబ అనే టైటిల్ పెడితే అందరూ తిట్టారని దర్శకుడు నాతో చెప్పారు. గతంలో మేము అహ నా పెళ్లంట అనే టైటిల్‌తో సినిమా చేసినప్పుడు అదే రకమైన విమర్శలొచ్చాయి. అయితే మేం హిట్ కొట్టాం. అలనాటి జంబలడికిపంబ తరహాలో ఈ సినిమా కూడా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు అల్లరి నరేష్. శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం జంబలకిడిపంబ. శివం సెల్యూలాయిడ్స్, మెయిన్ లైన్ ప్రొడక్షన్స్ పతాకాలపై రవి, జో జో జోస్, శ్రీనివాస్‌రెడ్డి ఎన్ నిర్మిస్తున్నారు. జె.బి.మురళీకృష్ణ (మను) దర్శకుడు. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. అల్లరి నరేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏపీ బీజేపీ ఎంఎల్‌సీ మాధవ్ థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ నిర్మాతలు నాకు మంచి మిత్రులు. వినోదంతో పాటు చక్కటి సందేశం మేళవించిన చిత్రమిది.

మనం మరచిపోతున్న సంస్కృతిని ఈ సినిమాలో గుర్తుచేశారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు. మనసు పెట్టి చేసిన వంటకంలాంటి సినిమా ఇది. ప్రతి ఒక్కరిని కడుపుబ్బా నవ్విస్తుంది. ఈవీవీగారి జంబలడికిపంబ పేరు పెట్టినందుకు సోషల్‌మీడియాలో చాలా మంది మమ్మల్ని తిడుతున్నారు. వారందరికి ఒకటే మనవి. అదొక కల్ట్‌మూవీ. పేరు పెట్టుకున్నందుకు ఆ సినిమా పరువు మాత్రం తీయం అని దర్శకుడు తెలిపారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సినిమాకు మంచి నిర్మాతలు దొరికారు. నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదు. దర్శకుడు మను ప్రతి విభాగంలో సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాడు. గోపీసుందర్ చక్కటి బాణీలిచ్చాడు. ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకునే చిత్రమవుతుంది అన్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో సినిమాను తెరకెక్కించామని, ఈ నెల 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. కథానుగుణంగా మెలోడీ ప్రధానంగా చక్కటి బాణీలు కుదిరాయని సంగీత దర్శకుడు గోపీసుందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్ కందుకూరి, తాగుబోతు రమేష్, ధన్‌రాజ్, వెన్నెల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

2015

More News

VIRAL NEWS