కథక్‌లో శిక్షణ


Thu,March 21, 2019 12:28 AM

Alia Bhatt stuns audience with Kathak moves in Kalank first song

పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి ప్రయాసకైనా సిద్ధమేనంటున్నారు నేటితరం కథానాయికలు. కలంక్ సినిమాలోని మూడు నిమిషాల నిడివి గల ఘర్ మోరే పరదేశీయా గీతం కోసం నాలుగు నెలల పాటు నృత్యంలో శిక్షణ తీసుకున్నదట అలియాభట్. ఈ గీతాన్ని చిత్రబృందం ఇటీవల విడుదలచేసింది. కథక్ జుగల్‌బందీ సంప్రదాయశైలిలో సాగిన ఈ పాటలో అలియాభట్, మాధురీ దీక్షిత్ నృత్యాలు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట గురించి అలియాభట్ మాట్లాడుతూ కథక్‌లో నాకు ప్రవేశం ఉంది. గతంలో ఏడాది పాటు నేర్చుకున్నాను. అయితే సినిమాలపరంగా శాస్త్రీయ నృత్యాల్ని ప్రదర్శించే అవకాశం ఇప్పటివరకు రాలేదు. కలంక్‌లో తొలిసారి నృత్యప్రధాన గీతంలో నటించాను. ఈ పాటకు న్యాయం చేయడానికి ప్రత్యేకంగా కథక్ పాఠాల్ని మళ్లీ నేర్చుకున్నాను. నాలుగు నెలలు శిక్షణ తీసుకున్నాను. పాటకు అనుగుణమైన ముఖకవళికలు, లిప్‌సింక్ కోసం బిర్జుమహరాజ్ వద్ద సలహాలు తీసుకున్నాను. అవన్నీ చాలా ఉపయోగపడ్డాయి అని తెలిపింది. స్వాతంత్య్రానికి పూర్వకాలం నాటి కథాంశంతో ప్రేమ, కులమత అంతరాలు, కుట్రల నేపథ్యంలో దర్శకుడు అభిషేక్ వర్మన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాధురీ దీక్షిత్, వరుణ్‌ధావన్, సోనాక్షి సిన్హా, ఆదిత్యరాయ్‌కపూర్, సంజయ్‌దత్ కీలకపాత్రలను పోషిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈచిత్రం విడుదలకానుంది.

912

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles