ఆర్.ఆర్.ఆర్ కోసం..


Sat,July 6, 2019 11:58 PM

Alia Bhatt  Ram Charan to Romance in SS Rajamouli  RRR Check Out

రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్న తాజా చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఇందులో తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు కొమరంభీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటిస్తున్నారు. ఆ పోరాట యోధుల చారిత్రక ఇతివృత్తానికి కాల్పనిక అంశాల్ని జోడించి రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దానయ్య నిర్మాత. దాదాపు 400కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 40శాతం చిత్రీకరణ పూర్తయింది. హైదరాబాద్, పూణే, గుజరాత్‌లో కీలక ఘట్టాల్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన అలియాభట్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె సీత పాత్రలో కనిపించనుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తదుపరి షెడ్యూల్ మరో 45రోజుల్లో అహ్మదాబాద్, పూణేలో ఆరంభంకానుందని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో అలియాభట్ చిత్ర బృందంలో జాయిన్ కానుంది. రామ్‌చరణ్, అలియాభట్‌పై కీలక ఘట్టాలను తెరకెక్కించబోతున్నారు. ఇటీవలే సుదీర్ఘ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన అలియాభట్ సీత పాత్ర కోసం సిద్ధమవుతున్నదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కోసం తెలుగులో శిక్షణ తీసుకుంటున్నది అలియాభట్. ఈ చిత్రంలో అజయ్‌దేవగణ్, సముద్రఖని ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు.

2095

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles