అర్జున్ సరసన


Tue,April 16, 2019 12:16 AM

Alia Bhatt opens up on RRR Rajamouli

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్ తో తెలుగు చిత్రసీమలో ఎంట్రీ ఇస్తున్నది బాలీవుడ్ సొగసరి అలియాభట్. తాజాగా తెలుగులో ఆమె మరో సినిమాను అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కథానాయకుడిగా ఎమ్‌సీఏ ఫేమ్ శ్రీరామ్‌వేణు దర్వకత్వంలో ఐకాన్-కనబడుటలేదు పేరుతో ఓ చిత్రం తెరకెక్కనున్నది. దిల్‌రాజు నిర్మించనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా అలియాభట్ నటించనున్నట్లు సమాచారం. కథానుగుణంగా సినిమాలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో అలియాభట్‌ను కథానాయికగా తీసుకోవాలని చిత్రబృందం నిశ్చయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

వినూత్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకిరానున్నది. త్వరలో పూణేలో ప్రారంభమయ్యే షెడ్యూల్‌తో ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌లో అడుగుపెట్టనున్నది అలియాభట్. ఈ సినిమాలో ఆమె రామ్‌చరణ్ సరసన నటించనుంది. హిందీలో అలియాభట్ నటించిన కలంక్ త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాతో పాటు మల్టీస్టారర్ చిత్రం బ్రహ్మాస్త్రలో అమితాబ్‌బచ్చన్, రణ్‌భీర్‌కపూర్‌లో కలిసి నటిస్తున్నది అలియాభట్.

1846

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles