తెలుగు పాఠాలు!


Tue,April 9, 2019 11:21 PM

Alia Bhatt begins learning Telugu for RRR

బాలీవుడ్ చిత్రసీమలో ప్రతిభావంతులైన నాయికల్లో అలియాభట్ ఒకరు. పాత్రకోసం ఎలాంటి సవాలుకైనా సిద్ధపడే తత్వం ఆమెది. ఇటీవల గల్లీ బాయ్ సినిమాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందీ ఈ సుందరి. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రం ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగుపెడుతున్నది. ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన నటించనుంది అలియాభట్. తన పాత్ర చిత్రణలో సహజత్వం కోసం తపించే ఈ సొగసరి ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటున్నదట. ప్రత్యేక శిక్షకుడి సహకారంతో ప్రతిరోజు తెలుగు పాఠాల్ని అభ్యసిస్తున్నదట. ఈ విషయం గురించి అలియాభట్ మాట్లాడుతూ తెలుగు చక్కటి భావయుక్తమైన భాష.

ఉచ్ఛారణ కొంచెం కష్టమనిపించినా అందులోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాను. భాషను ఆకళింపు చేసుకున్నప్పుడే పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేయగలమన్నది నా అభిప్రాయం. అందుకే ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుంటూ తెలుగుపై పట్టు సాధిస్తున్నాను అని చెప్పింది. తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీం, అల్లూరి సీతారామరాజు చారిత్రక జీవితానికి కాల్పనిక అంశాల్ని జోడించి దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కొమరం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్నారు. అలియాభట్ త్వరలో ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానుందని సమాచారం.

1293

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles