అలనాటి రామచంద్రుడి కథ


Mon,September 18, 2017 10:59 PM

suma
కె.సుమరాజీవ్ క్రియేషన్స్ పతాకంపై వ్యాఖ్యాత సుమ, రాజీవ్ కనకాల నిర్మించిన ఇండిపెండెంట్ ఫిల్మ్ అలనాటి రామచంద్రుడు. ప్రవీణ్ యండమూరి, పటమటలంక నవీన్, శ్రీముఖి మేకల ప్రధాన పాత్రల్లో నటించారు. సందీప్ మెండి దర్శకుడు. ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్‌లో దర్శకుడు రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. కొరటాల శివ జుజుబీ టీవీ ఏవీని విడుదల చేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ ట్రైలర్ చాలా బాగుంది. వెబ్ సిరీస్‌లో ఈ సినిమాను విడుదల చేయడం మంచి ప్రయత్నం అన్నారు. సుమ, రాజీవ్ సృజనాత్మకంగా ఆలోచిస్తారు..వారి ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని కొరటాల శివ చెప్పారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ కొత్త వారిని ప్రోత్సహించాలనే ఆలోచనతో ఈ సంస్థను స్థాపించాం. ఈ చిత్రాన్ని జుజూబి వెబ్ సిరీస్‌లో విడుదల చేస్తాం అన్నారు. ఇదొక దర్శకుడి కథ. వయసు పైబడుతున్నా తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి అతను ఏం చేశాడన్నది ఆసక్తికరంగా వుంటుంది. ఆద్యంత చక్కటి వినోదంతో అలరిస్తుంది అని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, శ్రీముఖి, జగదీష్, సంతోష్, హర్ష, యమున, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

277

More News

VIRAL NEWS