బ్యాడ్‌బాతొలిసారి చారిత్రక సినిమా


Mon,September 9, 2019 10:35 PM

Akshay Kumar to play Prithviraj Chauhan in biopic titled

విభిన్నమైన ఇతివృత్తాలతో సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో వరుస విజయాల్ని అందుకుంటున్నారు హీరో అక్షయ్‌కుమార్. తొలిసారి ఓ చారిత్రక సినిమాలో నటించబోతున్నారాయన. రాజపుత్ర రాజు పృథ్వీరాజ్ చౌహన్‌గా పరాక్రమాన్ని చూపించడానికి సిద్ధంకాబోతున్నారు. సోమవారం తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ చారిత్రక చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్‌ను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు అక్షయ్‌కుమార్. పృథ్వీరాజ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్నది. చంద్రప్రకాష్‌ద్వివేది దర్శకత్వం వహిస్తున్నారు. చారిత్రక కథాంశంతో నేను చేయనున్న తొలి చిత్రమిది. మహాయోధుడైన సామ్రాట్ పృథ్వీరాజ్ పాత్రను పోషిస్తుండటం గౌరవంగా భావిస్తున్నాను అని అన్నారు. 2020 దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అక్షయ్‌కుమార్ పేర్కొన్నారు.

260

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles