ట్రాన్స్‌జెండర్ లక్ష్మి

Thu,October 3, 2019 10:34 PM

బాలీవుడ్‌లో నవ్యత, వైవిధ్యతకు అక్షయ్‌కుమార్ సినిమాలు చిరునామాగా నిలుస్తుంటాయి. తాజా చిత్రం లక్ష్మిబాంబ్‌లో ట్రాన్స్‌జెండర్ పాత్రలో కనిపించబోతున్నారు అక్షయ్‌కుమార్. సినిమాలో తన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను గురువారం ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫస్ట్‌లుక్‌లో నుదుట పెద్ద తిలకం, ముక్కుపుడకతో ఎరుపురంగు చీర ధరించి మహిళా వేషధారణలో వినూత్నంగా కనిపిస్తున్నారాయన. లక్ష్మి అనే పాత్రలో నటిస్తున్నాను. కంఫర్ట్‌జోన్ నుంచి బయటపడినప్పుడే అసలైన జీవితం ప్రారంభమవుతుంది అంటూ అక్షయ్‌కుమార్ పేర్కొన్నారు. తమిళ చిత్రం కాంచన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు.

588

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles