క్రిష్ దర్శకత్వంలో?


Sat,May 11, 2019 12:02 AM

Akshay kumar and Krish to team up for a film

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత దర్శకుడు క్రిష్ నుంచి ఎలాంటి సినిమా ప్రకటన రాలేదు. ఆయన తదుపరి చిత్రమేమిటన్నది ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా కిలాడీ పేరుతో క్రిష్ ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. యాక్షన్ ఇతివృత్తంతో క్రిష్ చెప్పిన కథను అక్షయ్ ఓకే చేశారని, త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. బాలీవుడ్ పరిశ్రమలో అక్షయ్‌కుమార్‌తో క్రిష్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో గబ్బర్ ఈజ్ బ్యాక్ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన కేసరి చిత్రంతో అక్షయ్‌కుమార్ చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన హిందీలో నాలుగు చిత్రాల్లో నటిస్తున్నారు.

1302
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles