మన్మథుడి ప్రేమాయణం


Thu,July 18, 2019 01:18 AM

akkineni nagarjuna begins dubbing for rahul ravindrans manmadhudu-2

నాగార్జున, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం మన్మథుడు-2. మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయాకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ఆగస్ట్ 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ లేటు వయసులో అవంతిక అనే అందాల భామతో ప్రేమలో పడిన ఓ మన్మథుడి కథ ఇది. వారి ప్రేమప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా ఈ సినిమా ఉంటుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. నాగార్జున పాత్ర భిన్న పార్శాల్లో సాగుతూ నవ్యమైన అనుభూతిని పంచుతుంది. అవంతికగా రకుల్‌ప్రీత్‌సింగ్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాగార్జున తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది అని తెలిపారు. లక్ష్మి, వెన్నెలకిషోర్, రావురమేష్, ఝాన్సీ, దేవదర్శిని కీలక పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్.

916

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles